గరుడ వాహనంపై దర్శనమిచ్చిన వాడపల్లి వెంకన్న
కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా మూడవరోజు మంగళవారం సాయంత్రం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారు గరుడ, సింహ వాహనాలపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.