ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
MNCL: బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంతోష్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు ఈనెల 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని, వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.