దేశం దాటితే 100% సుంకాలు: ట్రంప్

హాలీవుడ్ నిర్మాతలకు అమెరికా అధ్యక్షుడు షాకిచ్చారు. విదేశాల్లో చిత్రీకరించే సినిమాలు, టీవీ షోలు, ఇతర వీడియో కంటెంట్‌పై 100% సుంకాలు విధించాలని ఆదేశాలు జారీ చేశారు. కొందరు నిర్మాతల తీరువల్ల హాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతుందని ట్రంప్ అన్నారు. USలోని సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు, కొత్తగా ఉద్యోగాలను కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.