VIDEO: అత్తకు తలకొరివి పెట్టిన కోడలు

VIDEO: అత్తకు తలకొరివి పెట్టిన కోడలు

కోనసీమ: ముమ్మిడివరం మండలం సీహెచ్. గున్నేపల్లి గ్రామానికి చెందిన పాపిరెడ్డి ఆదిలక్ష్మి (65) ఆదివారం మృతి చెందారు. ఆమె భర్త, కుమారుడు గతంలోనే మరణించడంతో, చిన్నపిల్లలైన మనుమల తరపున ఆమె కోడలు పాపిరెడ్డి శ్రీదేవి తలకొరివి పెట్టి, చివరి కర్మల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం గ్రామంలో ఈ దృశ్యం చూసి పలువురు భావోద్వేగానికి లోనయ్యారు.