త్రాగునీటి కోసం గ్రామస్తుల తిప్పలు

ఆనంతపరం: కదిరి నియోజకవర్గ పరిధిలోని నంబులపూలకుంట మండలం టీ. ఎన్ పల్లి పంచాయతీ దిన్నమీదపల్లి ఆర్డిటీ కాలనీలో త్రాగునీరు లేక దాదాపుగా వారం రోజుల నుండి ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడంలేదని వృద్ధులు, వికలాంగులు, మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని త్రాగునీరు ఏర్పాటు చేయాలని కోరారు.