నేటి నుంచి జిల్లాలో క్యాన్సర్ సర్వే

నేటి నుంచి జిల్లాలో క్యాన్సర్ సర్వే

SRD: సంగారెడ్డి జిల్లాలో ఈనెల 28 నుంచి మే 3వ తేదీ వరకు క్యాన్సర్ సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి సోమవారం ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాల నుంచి ఎవరికైనా క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే సంగారెడ్డిలోని క్యాన్సర్ కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారని పేర్కొన్నారు.