గిరిజన మ్యూజియం 12న మూసివేత

గిరిజన మ్యూజియం 12న మూసివేత

ASR: ఈనెల 12వ తేదీన పరిపాలన పరమైన కారణాలతో అరకులోయ గిరిజన మ్యూజియం, పెదలబుడు గిరి గ్రామదర్శిని పర్యాటక కేంద్రాలను మూసివేస్తున్నామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. 13వ తేదీన తిరిగి పునఃప్రారంభిస్తామని తెలిపారు. మ్యూజియం అధికారులకు, గిరి గ్రామదర్శిని అధికారులకు పర్యాటకులు సహకరించాలని కోరారు.