'ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం'
MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల కోసం మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని డీఎల్పివో ధర్మారాణి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా సోమవారం జన్నారం ఎంపీడీవో కార్యాలయంతో పాటు ప్రభుత్వ జడ్పీ పాఠశాలను ఆమె సందర్శించి అక్కడ చేస్తున్న ఏర్పాట్లను స్థానిక ఈవో రాహుల్ నుంచి అడిగి తెలుసుకున్నారు.