డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌కు ప్రొఫెసర్‌గా పదోన్నతి

PDL: గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జై కిషన్ ఓఝా ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. ఈ మేరకు కళాశాల విద్యా కమిషనర్ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా 2020లో ఆయన సత్కారం పొందారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సాంబశివరావు, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ సుబ్బారావు విద్యార్థులు శాలువాతో ఘనంగా సన్మానించారు.