సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
ASF: దహెగాం మండలం లగ్గాం గ్రామ పంచాయతీ 2వ వార్డులో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నస్కూరి రాములు ఇంటి నుంచి పంబాపూర్ బీటీ రోడ్డు వరకు రోడ్డు లెవలింగ్ పనులు పూర్తి చేసి, నిర్మాణం చేపట్టారు. దశాబ్దాల నిరీక్షణ ఫలించి, రవాణా కష్టాలు తీరనుండటంతో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.