పాలేరు జలాశయాన్ని పరిశీలించిన అధికారులు
KMM: మొంథా తుపాన్ కారణంగా పాలేరు జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ఇరిగేషన్ అధికారులు గేట్లెత్తి వరద నీటిని కిందికి పంపుతున్నారు. ఈ సందర్భంగా ఐబీ ఎస్ ఈ మంగళ పూడి వెంకటేశ్వర్లు ఇరిగేషన్ అధికారులతో కలిసి బుధవారం పాలేరు జలాశయాన్ని పరిశీలించారు. నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి వస్తున్న నీటిని నిలిపివేశామని తెలిపారు.