నేటి నుంచి హసన్ పర్తి రైల్వేగేట్ మూసివేత

నేటి నుంచి హసన్ పర్తి రైల్వేగేట్ మూసివేత

WGL: కాజీపేట-హసన్‌పర్తి రైల్వేస్టేషన్ల మధ్య కోమటిపల్లి రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్‌ వద్ద అప్ అండ్ డౌన్ రైల్వే ట్రాక్ మరమ్మతులు జరుగుతున్నాయి. అందువల్ల ఈనెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కోమటిపల్లి-దేవన్నపేట గ్రామాలను కలిపే ఈ గేట్ మూసివేస్తున్నట్లు కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్ అన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల మీదుగా రాకపోకలు సాగించాలని సూచించారు.