'బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం'
అన్నమయ్య: ఐపీఎల్ ప్రారంభం నేపథ్యంలో వీరబల్లి ఎస్సై సుస్మిత యువతకు హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్‌ను వినోదంగా మాత్రమే చూడాలని, బెట్టింగుల మోజులో పడకూడదని సూచించారు. బెట్టింగుల వల్ల యువత ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. బెట్టింగులకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.