వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు బుధవారం రావులపాలెం వాస్తవ్యులు సత్తి సాయి శ్రీ వైష్ణవి ఆమె కుటుంబ సభ్యులు రూ.1,00,000 విరాళం అందజేశారు విరాళం అందించారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. ఆయన దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.