వివేకానంద కాలనీలో తాగునీటి సమస్య
ప్రకాశం: గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీలో నెల రోజులుగా డీప్ బోరు పనిచేయకపోవడంతో తాగునీటి సమస్య నెలకొంది. నీటి సరఫరా లేక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పురపాలక అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే బోరు మరమ్మతులు చేసి నీటి సరఫరా పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.