VIDEO: దాచేపల్లిలో ర్యాగింగ్ కలకలం

PLD: దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం సీనియర్ విద్యార్థులు జూనియర్లను కిరాతకంగా కొట్టిన ఘటన కలకలం సృష్టించింది. ఐదుగురు సీనియర్లు కలిసి ఓ విద్యార్థిని బీసీ హాస్టల్‌కి తీసుకెళ్లి.. కరెంట్ షాక్ పెట్టి చంపుతామని బెదిరించినట్లు బాధిత విద్యార్థి తెలిపాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.