'సమన్యాయం పొందడం ప్రతి పౌరుడి హక్కు'
VZM: సమన్యాయం పొందడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత పేర్కొన్నారు. న్యాయసేవలపై పట్టణంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. పేదరికం లేదా ఇతర కారణాల వల్ల ఎవరూ న్యాయం పొందకుండా ఉండరాదని ఆమె స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందన్నారు.