'స్వరాష్ట్ర సాధనకు OU విద్యార్థులు నడుం బిగించారు'
HYD: తెలంగాణ మట్టి, నీరు, గాలికి చైతన్యం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆధిపత్యం చెలాయించాలని చూస్తే అప్పుడే పోరాటం పుడుతుందన్నారు. ఆనాటి పాలకులను అడవుల్లో పుట్టిన కొమురం భీమ్ గడగడలాడించారని గుర్తుచేశారు. ఉమ్మడి పాలనలో ఆరు దశాబ్దాల పాటు మన ఆకాంక్షలు నీరుగారాయని, స్వరాష్ట్ర సాధన కోసం ఉస్మానియా విద్యార్థులు నడుం బిగించారని తెలిపారు.