మందుబాబులకు బిగ్ షాక్!

మందుబాబులకు బిగ్ షాక్!

TG: మద్యం ప్రియులకు త్వరలో ధరల షాక్ తగలనుంది. మే నుంచి మద్యం, బీర్ల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల గాజు సీసాల తయారీ ఖర్చు విపరీతంగా పెరిగింది. దీంతో దేశంలో గాజు సీసాల ఉత్పత్తి 40% వరకు పడిపోగా, ఖాళీ సీసాల ధరలు 20% పెరిగాయి. ఈ నేపథ్యంలో ధరలను 12-15% పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇటీవల వినతిపత్రం కూడా సమర్పించాయి.