మావోలకు రివార్డులు అందిస్తాం: డీజీపీ
TG: లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు అందజేస్తామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఇవాళ 37 మంది మావోలు డీజీపీ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే వారికి తెలంగాణ ప్రభుత్వం తరపున పునరావాసం కల్పిస్తామని డీజీపీ చెప్పారు. తక్షణ సాయం కింద రూ. 25 వేలు అందిస్తామని పేర్కొన్నారు.