ఇందిరమ్మ ఇళ్లును ప్రారంభించిన ఎమ్మెల్యే
NGKL: సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, సీఎం సోదరుడు కృష్ణారెడ్డిలు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. పేదలకు సొంత ఇళ్లు కల్పించడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తేందని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.