సమ్మెను విరమించండి: శ్రీనివాసులరెడ్డి

సమ్మెను విరమించండి: శ్రీనివాసులరెడ్డి

KDP: మున్సిపల్ కార్మికుల ఆవేదనను ప్రభుత్వం గుర్తించింది సమ్మెను విరమించండి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ నాన్-పీహెచ్ పొరుగు సేవల సిబ్బందికి గౌరవ వేతన పెంపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కేటగిరీ 1, 2 సిబ్బందికి రూ. 3,000, కేటగిరీ 3 వారికి రూ. 3,500 పెంపు లభిస్తుందన్నారు.