'రైస్ మిల్లర్ల దోపిడి అరికట్టాలి'
కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్లర్ల దోపిడీని తక్షణమే అరికట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. నేడు ఆయన మాట్లాడుతూ.. తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు రైస్ మిల్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో రైతుల ఆధ్వర్యంలో రైస్ మిల్లుల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.