నగరంలో మంత్రి ఎంపీ పర్యటన

నగరంలో మంత్రి ఎంపీ పర్యటన

NLR: నగరంలో పలు ప్రాంతాల్లో రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలు ప్రాంతాల్లో గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా నగరంలోని 16వ డివిజన్ జగదీష్ నగర్ లో 25 లక్షలతో ఎండ్ టు ఎండ్ రోడ్డు పనుల్లో నాణ్యతను పరిశీలించారు, అనంతరం 15వ డివిజన్‌లో బాలాజీ నగర్‌లో కాలువ పూడిక తీత పనులను స్వయంగా పరిశీలించారు.