వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: గుడివాడ ఆఫీసర్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య నిపుణులు అందిస్తున్న చికిత్సలను కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము పరిశీలించారు. అనంతరం ఉచితంగా రోగులకు ఎమ్మెల్యే మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.