VIDEO: సుబ్రహ్మణ్యేశ్వరుడికి పంచామృతాభిషేకాలు

TPT: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం ఆడికృత్తిక నిర్వహించారు. ఈ మేరకు ఆలయంలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవ వగ్రహాలకు స్నపన తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వామివారిని సుగంధ, పంచామృతాలతో అభిషేకించారు. సాయంత్రం స్వామివారి తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.