సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్సై

సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్సై

MHBD: చిన్నగూడూరు మండలంలోని గుండంరాజుపల్లి సర్పంచ్ గునిగంటి కమలాకర్ సహకారంతో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలను స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, భద్రత కోసం నిఘా నేత్రాల ఏర్పాటు అత్యంత ముఖ్యమని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాలు నిఘా నేత్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు.