VIDEO: యాదాద్రి శ్రీ అమ్మవారికి కుంకుమార్చన
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహుడి సన్నిధిలో శుక్రవారం ఉదయం లక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. స్వయంభు మూర్తులకు నిజాభిషేకము అనంతరం పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో దివ్యమనోహరంగా స్వామివారిని, అమ్మవారిని అలంకరించి, లక్ష నామ స్తోత్రాలతో కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.