బాపట్ల కోర్టుకు వర్రా రవీంద్ర తరలింపు

కడప: అసభ్యకర పోస్టుల కేసులో కడప జైలుకు వెళ్లిన వర్రా రవీంద్రరెడ్డిపై ఉమ్మడి గుంటూరు జిల్లా పెదనందిపాడులో మరో కేసు నమోదైంది. ఈ దర్యాప్తులో భాగంగా రవీంద్రను PT వారెంట్‌పై కడప జైలు నుంచి బాపట్ల పోలీసులు బయటకు తీసుకు వచ్చారు. ఇవాళ ఆయనను బాపట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచనున్నట్లు సమాచారం.