'పెద్ది'.. జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్

'పెద్ది'.. జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం 'పెద్ది'. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో జాన్వీ 'అచ్చియమ్మా' అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలిపింది. కాగా, ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.