VIDEO: ఉండ్రుగొండలో శాస్త్రోక్తంగా సుదర్శన హోమం
SRPT: చివ్వెంల మండలం ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పరాభవనామ సంవత్సర చైత్ర పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెరుకుపల్లి కుమారాచార్యుల పర్యవేక్షణలో సుదర్శన సహిత లక్ష్మీనరసింహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.