VIDEO: వెనకున్న వాహనం హారన్.. కాలువలోకి దూసుకెళ్లిన బైకర్

VIDEO: వెనకున్న వాహనం హారన్.. కాలువలోకి దూసుకెళ్లిన బైకర్

గుంటూరు: మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో ఓ ద్విచక్ర వాహనదారుడికి గుర్తుతెలియని వాహనం బిగ్గరగా హారన్ వేయడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి బైక్‌తో పాటు దూసుకెళ్లాడు. ఈ ఘటనలో వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. తరచూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.