ఆళ్లగడ్డలో కొవ్వొత్తుల ప్రదర్శన
NDL: కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో మరణించిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వైసీపీ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు.