మాజీ మంత్రి అల్లోలను కలిసిన జునేద్
నిర్మల్ పట్టణానికి చెందిన జునేద్ డీసీసీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన జునేద్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.