శక్తిపీఠం గోశాలకు పశుగ్రాసం అందజేత

శక్తిపీఠం గోశాలకు పశుగ్రాసం అందజేత

NRPT: జిల్లా కేంద్రంలోని శక్తిపీఠం సురభి గోశాలకు సింగారం గ్రామానికి చెందిన వెంకటప్ప శుక్రవారం రెండు ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని వితరణగా అందజేశారు. గోశాల వ్యవస్థాపకుడు శాంతానంద్ పురోహిత్ ఈ విషయాన్ని తెలిపారు. గోవులకు గ్రాసం అందించిన వెంకటప్పకు పురోహిత్ కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తులు గోశాలలోని గోవులకు పశుగ్రాసం అందించాలని ఆయన కోరారు.