'జీడీపీ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి'
SKLM: జిల్లాలో 3వ త్రైమాసికానికి సంబంధించిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో GDP లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు ప్రధాన పాత్ర పోషించాలని అన్నారు. జిల్లా అభివృద్ధి వేగవంతం కావాలంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం పథకాలకు బ్యాంకులు సమయానికి రుణాలు మంజూరు చేయాలన్నారు.