మాతృ శిశు మ‌ర‌ణాల‌ప‌ట్ల క‌లెక్ట‌ర్‌ ఆగ్ర‌హం

మాతృ శిశు మ‌ర‌ణాల‌ప‌ట్ల క‌లెక్ట‌ర్‌ ఆగ్ర‌హం

విజయనగరం జిల్లాలో మాతృ, శిశు మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం ప‌ట్ల వైద్యారోగ్య‌శాఖ‌పై క‌లెక్ట‌ర్ ఎస్.రాంసుంద‌ర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌ర‌ణాలు చోటు చేసుకుంటుంటే క్షేత్ర‌స్థాయిలోని ప్ర‌భుత్వ యంత్రాంగం ఏంచేస్తుందని ప్ర‌శ్నించారు. పేద ప్ర‌జ‌ల ప్రాణాల ర‌క్ష‌ణ కోస‌మే ఈ యంత్రాంగం ఉంద‌ని, సిబ్బంది నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తే స‌హించేది లేద‌ని హెచ్చరించారు.