విజ్ఞాన వారోత్సవాలలో పాల్గొన్న విద్యార్థులు
SKLM: విద్యాశాఖ ఆదేశాల మేరకు విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించే దిశగా కృషి చేయడం జరుగుతుందని ఎంఈవో ఉప్పాడ శాంతారావు తెలిపారు. సోమవారం నరసన్నపేట పీఎం శ్రీ జడ్పీ పాఠశాలలో నిర్వహిస్తున్న వారోత్సవాలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులలో విజ్ఞాన పరంగా విద్యను అందించడం జరుగుతుందన్నారు. క్విజ్, వ్యాసరచన, విజ్ఞాన ప్రదర్శన చేపట్టామన్నారు.