VIDEO: అలుముకున్న పొగ మంచుతో వాహనదారుల ఇక్కట్లు
కోనసీమ: రావులపాలెం మండలంలోని పలు ప్రాంతాలలో గురువారం ఉదయాన్నే పొగమంచు కమ్మేసింది. మంచు వీడకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులు కనిపించక వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. భారీ మంచు వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని మామిడి రైతులు వాపోతున్నారు.