నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం

NRML: జన్నారం మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన గోనె రామక్క కుటుంబానికి రోటిగూడా సామాజిక సంక్షేమ కమిటీ నాయకులు సహాయం అందజేశారు. రామక్క కుమారుడు గోనె నరసయ్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో బుధవారం సాయంత్రం ఆ సంక్షేమ సమితి నాయకులు రామక్క కుటుంబ సభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆ కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సహాయం అందించారు.