దుష్ట పరిపాలనకు చరమగీతం పాడతాం: విజయ్
తమిళనాడులో నాలుగేళ్లుగా మాయమాటలతో కపట నాటకాలాడుతున్న దుష్టశక్తుల పాలనకు చరమగీతం పాడతామని టీవీకే అధినేత విజయ్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశక్తి విలువ ఏమిటో వారికి తెలియజేస్తామని పేర్కొన్నారు. అవినీతి అక్రమాలకు పెట్టింది పేరుగా ఉన్న పార్టీ.. ప్రస్తుతం టీవీకేపై దుమ్మెత్తి పోయడాన్నే పనిగా పెట్టుకుందని డీఎంకేపై పరోక్షంగా మండిపడ్డారు.