మల్కాజ్‌గిరి డిగ్రీ కాలేజీ అభివృద్ధికి రూ.2.5 కోట్లు
మల్కాజ్‌గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ముందడుగు పడింది. జిల్లా కలెక్టర్ మనూ చౌదరి కళాశాల అభివృద్ధికి రూ.2.5 కోట్లు మంజూరు చేయగా, కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే, జాతీయ స్థాయి అడ్వెంచర్ క్యాంపుకు ఎంపికైన విద్యార్థిని గోరెంట్ల నందినికి ఎమ్మెల్యే హృదయపూర్వక అభినందనలు తెలిపారు.