ఆపరేషన్ సింధూర్ ఒక సందేశం: మాజీ ఎంపీ

కృష్ణా: ఆపరేషన్ సింధూర్ కేవలం లక్ష్యం కాదు, ఒక సందేశం అని విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని అన్నారు. భారతదేశం ఓపికగా ఉన్నా బలహీనంగా లేదని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఖచ్చితత్వంతో దాడి చేసిన భారత దళాలకు జై హింద్ తెలిపారు. ఇది దేశ సత్తాను చాటి చెప్పే చర్య అని అభిప్రాయపడ్డారు.