ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి 22 సీట్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ 22 సీట్లు కైవసం చేసుకుని ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. దీంతో రెండో, మూడో విడత ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థులు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఇంటింటికీ ఓటర్లను కలుస్తూ, విజయాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ప్రచారం చేస్తున్నారు.