'దిత్వా' ఎఫెక్ట్.. జిల్లాకు వర్ష సూచన
KRNL: 'దిత్వా' తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తీరం వెంబడి 80 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీంతో జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జిల్లా యంత్రాంగం ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావోద్దని హెచ్చరించారు.