పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 9 మంది అరెస్ట్
SS: గోరంట్ల మండలంలోని నీలి కన్‌స్ట్రక్షన్ సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మంగళవారం దాడులు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు గోరంట్ల సీఐ శేఖర్ తన సిబ్బందితో కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో 9 మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.2,11,100 నగదుతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.