కేటీపీకే క్యాజువల్ కార్మికులకు ఎమ్మెల్యే హామీ

BHPL: పట్టణంలో సోమవారం ఉదయం కేటీపీకే క్యాజువల్ కార్మికులు ఎమ్మెల్యే సత్యనారాయణ రావుకు వినతిపత్రం సమర్పించారు. MLA మాట్లాడుతూ.. పదేళ్లుగా జెన్కోకు భాగస్వాములై కష్టపడుతున్నవారికి న్యాయం చేస్తానని, సమస్యను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆర్టిజన్లుగా గుర్తించే చర్యలు చేపడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.