యుద్ధం మొదలైనప్పటి నుంచి 200 మంది చిన్నారులు మృతి
అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి 200 మంది చిన్నారులు మృతి చెందారని యూనిసెఫ్ వెల్లడించింది. అత్యధికంగా 181 మంది ఇరాన్‌లో, లెబనాన్‌లో ఏడుగురు, ఇజ్రాయెల్‌లో ముగ్గురు, కువైట్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదిక తెలిపింది. యుద్ధాలను పిల్లలు ప్రారంభించరని.. కానీ మూల్యం మాత్రం వారు చెల్లిస్తున్నారని యూనిసెఫ్ ఆవేదన వ్యక్తం చేసింది.