మాజీ సర్పంచ్ తమ్ముడు అనారోగ్యంతో మృతి
KDP: ఖాజీపేట మండలం చెముల్లపల్లె గ్రామానికి చెందిన వైసీపీ నేత, మాజీ సర్పంచ్ వై. గురివిరెడ్డి తమ్ముడు రవీంద్రారెడ్డి అనారోగ్యంతో మరణించారు. రవీంద్రారెడ్డి మృతదేహాన్ని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి సందర్శించి పూలమాలలతో నివాళులర్పించారు. చిన్నతనంలో మరణించాడం బాధాకరమని తమ సమీప బంధువు మరణించాడం జీర్ణించుకోలేక పోతున్నామన్నారు.