రాష్ట్ర పోటీలకు జిల్లా తుది జట్టు ఎంపిక

రాష్ట్ర పోటీలకు జిల్లా తుది జట్టు ఎంపిక

NZB: ఈ నెల 25 నుంచి 27 వరకు మహబూబ్‌నగర్ జిల్లా ఉట్నూర్‌లో జరిగే జూనియర్ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు జిల్లా జట్లు బయలుదేరాయి. నగరంలో జిల్లా క్రీడా ప్రాంగణంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి తుది జట్టును వెల్లడించారు. ఎంపికైన క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందించినట్లు ఆర్గనైజింగ్ కార్యదర్శి బొబ్బిలి నరేష్ తెలిపారు.